: రేషన్, గ్యాస్ కు తప్ప మరే ఇతరాలకు ఆధార్ తప్పనిసరి కాదు: సుప్రీంకోర్టు తీర్పు


వివిధ రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులకు ఆధార్ తో అనుసంధానం తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయితే, ప్రజా పంపిణీ వ్యవస్థ, గ్యాస్ రాయితీలను పొందాలంటే మాత్రం ఆధార్ తప్పనిసరని అత్యున్నత ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ కార్డును పొందే సందర్భంగా ప్రజలు ఇచ్చిన వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ ఇవ్వరాదని, అలా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని యఐడీఏఐ విభాగానికి ఆదేశాలు ఇచ్చింది. ఆధార్ తప్పనిసరి కాదని పత్రికలు, టీవీల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని ధర్మాసనం ప్రభుత్వానికి సూచించింది.

  • Loading...

More Telugu News