: బాహుబలి సీక్వెల్ కోసం త్యాగం చేసిన కట్టప్ప
బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్ర పోషించి విమర్శకుల మన్ననలను సైతం అందుకున్న నటుడు సత్యరాజ్. ఆయన పోషించిన కట్టప్ప పాత్ర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. అంతేకాదు కట్టప్ప క్యారెక్టర్ బాహుబలి-2 సినిమా కోసం ప్రేక్షకులను ఎదురు చూసేలా చేస్తోంది. ఇప్పడు ఎక్కడ చూసినా 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు' అన్న చర్చే నడుస్తోంది. ఈ నేపథ్యంలో బాహుబలి-2 కోసం 'కట్టప్ప' సత్యరాజ్ పెద్ద త్యాగమే చేశాడు. తమిళ అగ్రనాయకుడు విజయ్ 59వ చిత్రంలో విలన్ గా నటించే అవకాశాన్ని సత్యరాజ్ వదులుకున్నాడు. బాహుబలి-2 షూటింగ్ కోసం సత్యరాజ్ 100 రోజులు కేటాయించనున్నాడు. ఈ నేపథ్యంలో, విజయ్ సినిమాలో నటించే అవకాశాన్ని ఆయన వదులుకున్నాడు. తప్పని పరిస్థితుల్లోనే సత్యరాజ్ ఈ త్యాగం చేశాడని సినీ వర్గాలు చెబుతున్నాయి. బాహుబలి-2లో కట్టప్ప పాత్ర కీలకంగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి.