: ‘హోదా’ను బిల్లులో పెట్టలేదని సొల్లు చెప్పొద్దు... కేంద్ర మంత్రులకు శివాజీ సూచన
ఏపీ పునర్ వ్యవస్థీకరణ బిల్లులో ఏపీకి ప్రత్యేక హోదాపై ఆ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు చేస్తున్న ప్రకటనలపై ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు, సినీ నటుడు శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన బిల్లులో ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఎక్కడా లేదన్న సొల్లు కబుర్లు చెప్పడం మాని, రాష్ట్రానికి మంచి జరిగేలా చూడాలని ఆయన కోరారు. కేంద్ర మంత్రులు చేస్తున్న ప్రకటనలతో ఏపీకి ఇక ప్రత్యేక హోదా రాదన్న భావనతో యువత ఆందోళన చెందుతోందని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే మునికోటి ఆత్మహత్య ఘటన జరిగిందని కూడా శివాజీ అన్నారు. ఇకనైనా యువతను ఆందోళనకు గురిచేసే ప్రకటనలు మాని, రాష్ట్రానికి మేలు జరిగేలా ప్రత్యేక హోదా సాధించేలా ప్రధాని మోదీపై ఒత్తిడి చేయాలని ఆయన కోరారు,