: ప్రత్యేక హోదాపై రాజ్యసభలో ఆవేశంగా ప్రసంగించిన జేడీ శీలం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రకటించే విషయమై ప్రధాని మోదీ తక్షణం స్పందించాలని రాజ్యసభ సభ్యుడు జేడీ శీలం తీవ్ర ఆవేశంగా ప్రసంగించారు. తన స్థానంలోనే నిలబడి గొంతుచించుకునేలా మాట్లాడిన ఆయన "హోదా కోసం ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. అయినా కేంద్రం కళ్లు తెరవలేదు. నాటి ప్రధాని ఇచ్చిన హామీకి విలువ లేనట్లేనా? పాత ప్రభుత్వం సభలో ఇచ్చిన హామీలకు గౌరవం ఇవ్వరా? ప్రత్యేక హోదా, రాష్ట్రాభివృద్ధికి నిధులు తదితర అన్ని విషయాల్లో కేంద్రం సహకరిస్తుందా? లేదా?" అని శీలం ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ప్రధాని ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? అంటూ, పార్లమెంట్ మొత్తం కలిసి తీసుకున్న నిర్ణయాలకే విలువ లేకుంటే ప్రజాస్వామ్యంపై నమ్మకాలు తొలగినట్లేనని ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News