: ఓ వైద్యుడిని అక్కడికక్కడే సస్పెండ్ చేసిన మంత్రి కామినేని
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఓ వైద్యుడిని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కాలేజీలలో మంత్రి కామినేని ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వైద్యుడు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో అతడిని సస్పెండ్ చేశారు. అంతేకాకుండా, సరైన సమయానికి వైద్యులు హాజరుకాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, కాలేజీ ప్రిన్సిపాల్ ను కూడా రిలీవ్ చేస్తున్నట్టు ప్రకటించారు.