: పాక్ ఉగ్రవాది నవేద్ కు పోలీస్ కస్టడీ


పాకిస్థాన్ ఉగ్రవాది నవేద్ యాకుబ్ కు జమ్మూలోని ఎన్ఐఏ కోర్టు కస్టడీ విధించింది. బీఎస్ఎఫ్ జవాన్లపై దాడికి పాల్పడిన ఘటనలో పట్టుబడ్డ అతడిని ఈరోజు కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తున్నట్టు కోర్టు తెలిపింది. పోలీస్ కస్టడీలో అతన్ని విచారించి పోలీసులు సమాచారం రాబట్టనున్నారు. ఉదంపూర్ లోని బీఎస్ఎఫ్ జవాన్ల కాన్వాయ్ పై దాడికి పాల్పడి ఇద్దరు జవాన్ల మృతికి కారణమైన ఘటనలో నవేద్ సజీవంగా పట్టుబడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News