: విప్ జారీ చేసిన బీజేపీ, కాంగ్రెస్
జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. ఈ రోజు, రేపు తప్పనిసరిగా పార్లమెంటుకు హాజరుకావాలని తమ సభ్యులను ఆదేశించాయి. దీంతో, పార్లమెంటు వర్షాకాల సమావేశాల చివరి రెండు రోజుల్లో ఏదో జరగబోతోందన్న సంకేతాలు వెలువడినట్టు అయింది. మరోవైపు, ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ అంశంపై పార్లమెంటు ఉభయసభలు దద్దరిల్లుతున్నాయి. లోక్ సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ ఛైర్ పర్సన్ లు సభలను ఆర్డర్ లో పెట్టేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం దక్కడం లేదు.