: ‘హోదా’పై చర్చకు అనుమతించండి... లోక్ సభలో వైసీపీ వాయిదా తీర్మానం


ఢిల్లీలో ఏపీకి ప్రత్యేక హోదాపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిన్న లోక్ సభలో ఏపీకి ప్రత్యేక హోదాపై తక్షణ చర్చ కోసం టీడీపీ లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు నోటీసు ఇచ్చింది. తాజాగా నేడు అదే అంశంపై చర్చకు అనుమతించాలని వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఓ వైపు ‘హోదా’ కోసం సీపీఐ ఇచ్చిన పిలుపు మేరకు ఏపీలో బంద్ కొనసాగుతోంది. టీడీపీ, బీజేపీ మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి, ప్రజా సంఘాలు ఈ బంద్ కు మద్దతిచ్చాయి. మరోవైపు ఢిల్లీలో నిన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధర్నాకు దిగారు. తాజాగా ఆ పార్టీ ఎంపీలు లోక్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు.

  • Loading...

More Telugu News