: ఏం, మీకు యుద్ధం కావాలా?: పాకిస్థాన్ పై విరుచుకుపడ్డ ఆప్ఘన్


తాలిబన్ల విషయంలో పాకిస్థాన్ తీరును ఆఫ్ఘనిస్థాన్ తీవ్రంగా తప్పుబట్టింది. తీవ్రవాదులకు ఆశ్రయమిచ్చి, వారికి స్వర్గధామంగా నిలుస్తూ, సీమాంతర ఉగ్రవాదాన్ని ఆ దేశం పెంచి పోషిస్తోందని అధ్యక్షుడు మొహమ్మద్ అష్రాఫ్ ఘనీ విరుచుకుపడ్డారు. ఉగ్రవాద శిబిరాలు నిర్వహిస్తున్న పాక్ పొరుగుదేశాలకు యుద్ధ సంకేతాలు పంపుతోందని ఆయన ధ్వజమెత్తారు. ఆఫ్ఘన్ లో తాలిబన్ల వరుస దాడులపై ఘనీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా పాకిస్థాన్ తో సత్సంబంధాలకై తాము ప్రయత్నాలు చేస్తుంటే ఆ దేశం యుద్ధాన్ని కోరుకుంటున్నట్టు కనిపిస్తోందని విమర్శించారు. తాలిబన్లతో శాంతి చర్చల విషయంలోనూ పాక్ వైఖరి తమకు అసంతృప్తి కలిగించిందని అన్నారు. "తాలిబన్ల స్థావరాలు పాక్ లో ఉన్నాయి. వారి కార్యకలాపాలు అక్కడి నుంచే సాగుతున్నాయి. ఈ విషయాన్ని పాక్ అధికారుల ముందుంచాం. వారిని శాంతి చర్చలకు తీసుకురాలేకపోతే, తాలిబన్లకు సాయపడటాన్ని ఆపివేయాలి. వారి స్థావరాలు మూసేసేలా సైనిక చర్యలు చేపట్టాలి. తీవ్రవాదులకు కఠిన శిక్షలు విధించాలి. గాయపడ్డవారిని ఆసుపత్రుల్లో చేర్చుకోరాదు. ఇలా చేయకుంటే, పొరుగు దేశాల నాశనాన్ని, యుద్ధాన్ని పాక్ కోరుకుంటున్నట్టే భావించాల్సి వస్తుంది" అని ఘనీ అన్నారు.

  • Loading...

More Telugu News