: మార్నింగ్ వాక్ లో ఎంపీటీసీని వేట కొడవళ్లతో నరికి చంపిన దుండగులు


పాలమూరు జిల్లాలో నేటి ఉదయం పాత కక్షలు భగ్గుమన్నాయి. ప్రశాంతంగా మార్నింగ్ వాక్ చేస్తున్న ఓ ప్రజా ప్రతినిధిని ఆయన ప్రత్యర్థులు అత్యంత దారుణంగా వేట కొడవళ్లతో నరికి చంపారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో చోటుచేసుకున్న ఈ ఘటనలో గొరగొండ ఎంపీటీసీ అరుణాచలం రాజు హత్యకు గురయ్యాడు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజు గొరగొండ ఎంపీటీసీగా ఎన్నికైనా, దేవరకద్రలోనే నివాసముంటున్నారు. ఈ క్రమంలో నేటి ఉదయం మార్నింగ్ వాక్ చేస్తున్న రాజుపై గుర్తు తెలియని దుండగులు వేట కొడవళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో రాజు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనకు పాత కక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News