: మీకు తెలుసా? గ్యాస్ సిలిండర్ పేలితే రూ. 40 లక్షల బీమా... దాచివుంచిన చమురు సంస్థలు!


ప్రమాదవశాత్తూ వంట గ్యాస్ సిలిండర్ పేలితే రూ. 40 లక్షల ప్రమాద బీమా వినియోగదారుడికి ఉంటుంది. సిలిండర్ పేలి, బతికి బయటపడ్డా కూడా రూ. 30 లక్షల వరకూ ఇవ్వాలన్న నిబంధన ఉంది. ఈ విషయం గ్యాస్ వినియోగదారుల్లో ఎంతమందికి తెలుసు? ఏదైనా ప్రమాదం జరిగితే చమురు కంపెనీలు బాధితులకు బీమా సొమ్ములను ఎన్నిసార్లు ఇచ్చాయి? అసలు గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే చాలు, ఆ వినియోగదారులు, అతని కుటుంబం బీమాకు అర్హులైపోతారు. ఈ విషయం గ్యాస్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో కూడా అత్యధికులకు తెలియదు. ఇక ప్రజలకు ఎలా తెలుస్తుంది? చమురు కంపెనీల నిబంధనల ప్రకారం వంట గ్యాస్ వినియోగిస్తున్న కస్టమర్లందరికీ బీమా చేస్తారు. ఈ విషయాన్ని డీలర్లెవరూ వినియోగదారులకు చెప్పడం లేదు. ప్రభుత్వం, గ్యాస్ కంపెనీలూ కుమ్మక్కై ఇంత ముఖ్యమైన సమాచారాన్ని ఇంతకాలం బయటకు రానివ్వలేదు. దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు పేలిన ఘటనల సంఖ్య ఎంతో ఉంది. ఈ పాలసీ ద్వారా లాభపడ్డ వారి వివరాలు లేనేలేవు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులు సంబంధిత డీలరుకు విషయం తెలియజేస్తే, వారు బీమా కంపెనీకి చెప్పి, విచారణ జరిపించి ఈ డబ్బు చెల్లిస్తారు. దురదృష్టవశాత్తు గ్యాస్ ప్రమాదాలు జరిగితే టోల్ ఫ్రీ సంఖ్య 18002333555కు ఫిర్యాదు చేసి బీమా సొమ్ము పొందాలని సూచన.

  • Loading...

More Telugu News