: వర్షాలా?... పాపాలు పెరిగిపోతున్నాయి రా!... 'రంగం'లో అమ్మవారు
లోకంలో రోజురోజుకీ పాపాలు పెరిగిపోతున్నాయని అమ్మవారు ఆందోళన వ్యక్తం చేశారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయంలో బోనాల పండగ సందర్భంగా 'రంగం' కార్యక్రమం నిర్వహించారు. పాపాలు పెరిగిపోవడం వల్లే వర్షాలు సకాలంలో కురవడం లేదని రంగంలో అమ్మవారు పూనిన జోగిని అనూరాధ తెలిపారు. అయితే తాను అండగా ఉంటానని, ఇకపై సకాలంలో వర్షాలు కురుస్తాయని ఆమె భరోసా ఇచ్చారు. అమ్మవారికి సాకను పెట్టాలని, ఆలయం పెద్దదిగా చేయాలని సూచించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటారని, అయితే పాపాలు పెరిగిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలదేనని ఆమె స్పష్టం చేశారు.