: తమిళనాట 'అమ్మ' కరుణించలేదట... అమ్మలగన్నఅమ్మకు వినతిపత్రం!
తమిళనాడులో మద్యాన్ని నిషేధించాలంటూ పోరాటం చేస్తుంటే అమ్మ (ముఖ్యమంత్రి జయలలిత) కరుణించడం లేదంటూ, ప్రజలు ఆలయంలోని అమ్మవారి విగ్రహానికి వినతిపత్రాలు సమర్పించారు. ఓ ప్రాంతంలో ఉన్న మద్యం దుకాణాన్ని మూసివేయాలని ఇండియా జననాయక పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పలుమార్లు విన్నవించినా, జయలలిత సర్కారు తమ మాట వినడం లేదని, వీరంతా పార్టీ కార్యదర్శి సెంథిల్ కుమార్ నేతృత్వంలో వడక్కుంపట్టిలోని ఒండి మారియమ్మన్ ఆలయానికి వెళ్లి వినతిపత్రాలు సమర్పించారు. రాష్ట్రాన్ని పాలించే అమ్మకు దయరాలేదు. లోకాన్ని ఏలే నీవైనా కరుణించమని వేడుకున్నారు. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి వినతిపత్రాలు పాదాల వద్ద ఉంచి తమ నిరసనను వెరైటీగా తెలిపారు.