: ఏపీకి ప్రత్యేక హోదా కంటే రెట్టింపు నిధులు ఇచ్చేందుకు కేంద్రం ప్రణాళిక: ఎంపీ హరిబాబు
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ అంతా డిమాండ్ చేస్తున్న వేళ బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు మాత్రం 'హోదా కాకుండా నిధుల' గురించి మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదా వల్ల వచ్చే నిధుల కంటే రెట్టింపు నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందని చెప్పారు. రాజధానికి ప్రణాళిక సిద్ధం కాకపోయినా ఇప్పటికే కేంద్రం వెయ్యికోట్లు మంజూరు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అంతేగాక విభజన చట్టంలో లేని అంశాలను కూడా కేంద్రం అమలు చేస్తోందన్నారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, ప్రతిపక్షాలు లేనిపోని అపోహలు సృష్టించి ప్రజలను భయాందోళనలకు గురి చేయవద్దని సూచించారు. ఇక ప్రత్యేక హోదా గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హరిబాబు పేర్కొన్నారు.