: అమరావతికి ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై నివేదిక
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుకు జవహర్ రెడ్డి కమిటీ నివేదిక సమర్పించింది. ఉద్యోగుల కోసం ప్రస్తుతానికి 7 లక్షల చదరపు అడుగుల భవనాలు అందుబాటులో ఉన్నాయని నివేదికలో తెలిపింది. మొత్తం 25వేల మంది సిబ్బందికి 25 లక్షల చదరపు అడుగుల భవనాలు అవసరమని నివేదికలో కమిటీ పేర్కొంది. మరిన్ని భవనాలను పరిశీలిస్తామని తెలపగా, ఉద్యోగుల నివాసానికి అవసరమైన భవనాలపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని కమిటీ సూచించింది.