: చంద్రబాబును సూటిగా అడుగుతున్నా: రామచంద్రయ్య


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎక్కడ? ఎవరితో పోరాడారో చెప్పాలని కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య డిమాండ్ చేశారు. తిరుపతిలో మునికోటి మృతదేహానికి నివాళులర్పించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలను ఎలా మభ్యపెట్టాలా? మీడియా ముందుకు ఎలా వెళ్లాలా? అని చంద్రబాబు ఆలోచిస్తారని విమర్శించారు. చంద్రబాబుకు ప్రత్యేకహోదాపై చిత్తశుద్ధిలేదని ఆయన మండిపడ్డారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేకహోదాపై ఎవరితో చర్చించారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం విభజించబడి ఇంత కాలమైనా ఒక్కహామీ కూడా నెరవేరలేదంటే దానికి కారణం చంద్రబాబు అసమర్థతేనని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా సాధించే వరకు పోరాడుతామని ఆయన తెలిపారు. ప్రత్యేకహోదా కోసం చేసే పోరాటంలో టీడీపీ తమతో కలిసి నడవగలదా? అని ఆయన సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News