: రాజకీయ నేతల స్వార్థమే మునికోటిని బలితీసుకుంది: తిరుపతి ప్రజలు


రాజకీయ నాయకుల స్వార్థమే మునికోటిని బలి తీసుకుందని తిరుపతి ప్రజలు అభిప్రాయపడ్డారు. మునికోటి మృతదేహాన్ని తిరుపతి తరలించిన సందర్భంగా పలువురు మాట్లాడుతూ, పార్టీలు, ప్రతిష్ఠ మాత్రమే తమకు ప్రధానమని భావించిన రాజకీయనాయకులు రాష్ట్రాన్ని గాలికోదిలేశారని ఆరోపించారు. ప్రత్యేకహోదా వస్తే ప్రజలకు, రాష్ట్రానికి ఏ రకమైన లబ్ది చేకూరుతుందో తెలిసినా పదవుల కోసం నేతలు ప్రత్యేకహోదాని పట్టించుకోవడం మానేశారని అన్నారు. టీడీపీకి మంత్రి పదవులు ముఖ్యమైతే, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని అభిప్రాయపడ్డారు. బీజేపీ ఏరుదాటాక తెప్పతగలేసిందని వారు పేర్కొన్నారు. ప్రజలు ఏమైపోయినా పర్లేదని రాజకీయ నాయకులు భావిస్తున్నారని వారు మండిపడ్డారు. రాజకీయ నాయకులు ఆడుతున్న ఆటలో పావులు కావొద్దని యువకులకు పలువురు హితవు పలికారు. పూటగడుపుకునే నేతల మాటలు విని కన్నవారికి కడుపుకోత మిగల్చవద్దని వారు సూచిస్తున్నారు. హోదా రాకపోతే కష్టపడి సాధించుకోవచ్చు కానీ ప్రాణాలు పోతే తిరిగిరావని వారు సూచించారు.

  • Loading...

More Telugu News