: చంద్రబాబుకు సవాల్ విసిరిన షర్మిల


వైఎస్సార్పీసీ నేత షర్మిల నేడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి సవాల్ విసిరారు. బయ్యారం గనుల విషయంలో తమ కుటుంబ ప్రమేయం ఉన్నట్టు బాబు నిరూపిస్తే తాను పాదయాత్ర నిలిపివేస్తానని షర్మిల అన్నారు. తమకు బయ్యారం గనులతో ఎలాంటి సంబంధం లేదని షర్మిల స్పష్టం చేశారు. ప్రస్తుతం షర్మిల కృష్ణా జిల్లాలో పాదయాత్ర ముగించుకుని ఖమ్మం జిల్లా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనేది తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కోరిక అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News