: వలసల పాలమూరులో అత్యంత విలువైన వజ్రాల గనులు!


అభివృద్ధికి దూరంగా, కరవుకు, వలసలకు దగ్గరగా ఉండే తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా వజ్రాల గనులపై ఉందని, ఈ జిల్లాలోని కృష్ణ, భీమ నదుల మధ్య, కృష్ణ, తుంగభద్ర పరీవాహక ప్రాంతాల్లో 20కి పైగా వజ్రాల గనులున్నాయని, ఇవి జిల్లా రూపురేఖలను మార్చి, అత్యంత శక్తిమంతం చేస్తాయని రీసెర్చర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని సెంటర్ ఆఫ్ ఎక్స్ ప్లోరేషన్ జియోఫిజిక్స్ విభాగం లెక్కల ప్రకారం, మహబూబ్ నగర్ నుంచి రాయచూర్ వెళ్లే మార్గంలోని పలు చోట్ల భూగర్భంలో వజ్రాలు వున్నాయి. జిల్లా పరిధిలో మొత్తం 21 డైమండ్ జోన్లున్నాయి. జిల్లాలో వజ్రాల నిల్వలపై గతంలో ఎన్నో అధ్యయనాలు జరిగినప్పటికీ, అధికారిక ప్రకటనలు వెలువడలేదు. జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం, మూడు డైమండ్ జోన్లుండగా, ఉస్మానియా రీసెర్చర్లు 21 జోన్లున్నాయని గుర్తించడం గమనార్హం. జిల్లా పరిధిలోని 1,999 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ఏరోమాగ్నటిక్ అధ్యయనాల ద్వారా పరిశీలించిన ప్రొఫెసర్ రామదాస్ బృందం భూమికి 1.2 కి.మీ దిగువన ఈ వెలకట్టలేని రాళ్లున్నాయని తేల్చారు. వీటిపై మరింతగా అధ్యయనాలు చేస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News