: బుల్లెట్ నుంచి మహిళ ప్రాణాలు కాపాడిన అండర్ గార్మెంట్ .. జర్మనీలో అరుదైన ఘటన


అండర్ గార్మెంట్ (లో దుస్తులు) ఏమిటి, మహిళ ప్రాణాలు కాపాడటమేమిటనేగా మీ డౌటు. ఇది అందరి మదిలోనూ మెదిలేదే! అయితే, వాటి కారణంగా తుపాకీ తూటా నుంచి ప్రాణాలను నిలబెట్టుకున్న మహిళే స్వయంగా ఈ విషయం చెప్పడంతో నమ్మక తప్పని పరిస్థితి. వివరాల్లోకెళితే... జర్మనీ నగరం నార్త్ రైన్ పాలియంకు చెందిన ఓ జంట బైక్ పై వెళుతూ అడవి పందుల వేట సాగుతున్న ప్రాంతంలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో బైక్ వెనుక కూర్చున్న మహిళకు హఠాత్తుగా ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో బైక్ ఆపిన ఆమె భర్తకు అక్కడికి సమీపంలో ఓ బుల్లెట్ కనిపించింది. అసలు విషయమేంటంటే, ఓ వేటగాడు పందులపైకి కాల్చిన తూటా ఒకటి ఆ మహిళపైకి దూసుకొచ్చింది. అదృష్టవశాత్తు అది ఆమె ధరించిన ‘బ్రా’ కిందిభాగంలోని తీగకు తగిలి పక్కకు మళ్లింది. దీంతో తృటిలో ఆ మహిళ ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.

  • Loading...

More Telugu News