: ‘హోదా’ కోసం ప్లకార్డు చేతబట్టిన జేడీ శీలం... వాయిదా పడ్డ రాజ్యసభ
ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆ రాష్ట్ర వాసులు ఉవ్వెత్తున ఉద్యమిస్తున్నారు. తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతా మోహన్ ఆర్టీసీ డిపో ముందు బైఠాయించారు. తాజాగా రాజ్యసభలో ఆ పార్టీ సభ్యుడు జేడీ శీలం నిరసన గళం వినిపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మునుపెన్నడూ లేని విధంగా ఆయన ప్లకార్డు చేతబట్టారు. నిండు సభలో పెద్ద పెట్టున నినాదాలు చేసిన జేడీ శీలం, ఏపీ ప్రజలు వ్యక్తం చేస్తున్న ఆగ్రహావేశాలను సభకు తెలియజెప్పారు. ఆయన నినాదాల హోరుతో డిప్యూటీ చైర్మన్ కురియన్ సభను వాయిదా వేశారు.