: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సందర్శనకు తాత్కాలిక బ్రేక్


శంషాబాద్ ఎయిర్ పోర్టు సందర్శనకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈరోజు నుంచి ఈ నెల 30 వరకు విమానాశ్రయ సందర్శనకు అధికారులు నో ఎంట్రీ బోర్డు పెట్టారు. ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారుల హెచ్చరికల నేపథ్యంలో భద్రత దృష్ట్యా ఎయిర్ పోర్టు చుట్టూతా రక్షణ వ్యవస్థ కట్టుదిట్టం చేశారు. దాంతో విమానాశ్రయం చూడాలని వచ్చేవారికి నిరాశ మిగలనుంది. అయితే విమానాశ్రయానికి వచ్చే ప్రతి ఒక్కరినీ ఎయిర్ పోర్టు అధికారులు తనిఖీ చేసి అనుమతిస్తున్నారు.

  • Loading...

More Telugu News