: ఢిల్లీలో మొదలైన జగన్ దీక్ష.. ప్రత్యేక హోదా కోరుతూ నిరసన... వేదికపై మునికోటికి నివాళులు
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్ష మొదలైంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆయన ఈ దీక్షకు పూనుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా కోరుతూ ప్రాణాలు విడిచిన మునికోటి ఫోటోను సభా వేదికపై ఉంచి జగన్ నివాళులర్పించారు. దీక్షలో వైసీపీ నేతలు విజయసాయి రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, మహిళా నేతలు, భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 3 గంటలవరకు ఈ దీక్ష జరగనుంది. తరువాత పార్లమెంట్ వరకు మార్చ్ నిర్వహించనున్నారు. దీక్ష నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద పోలీసులు భారీ భద్రత చేపట్టారు.