: జార్ఖండ్ దుర్గామాత ఆలయంలో తొక్కిసలాట... 12 మంది మృతి, 50 మందికి గాయాలు
జార్ఖండ్ లో నేటి ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని దియోగఢ్ దుర్గామాత ఆలయంలో కొద్దిసేపటి క్రితం తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 12 మంది చనిపోగా, 50 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సావన్ సోమవార్ ను పురస్కరించుకుని నేటి తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తజనం పోటెత్తింది. ఆలయానికి ఒక్కసారిగా భక్తులు పోటెత్తడంతోనే ఈ తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.