: నిలిచిపోయిన అమర్ నాథ్ యాత్ర రాకపోకలు
పవిత్ర పుణ్యక్షేత్రం అమర్ నాథ్ యాత్ర రెండో రోజు కూడా నిలిచిపోయింది. జమ్ము కాశ్మీర్ లో కురుస్తున్న భారీ వర్షాలతో రాకపోకలకు ఆటంకం కలిగింది. కుండపోత వర్షంతో ఉధంపూర్ జిల్లాలోని ఖేరీ ప్రాంతంతో పాటు రాంబాన్ రహదారి మార్గంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో, ఆ రహదారిని మూసివేసినట్టు అధికారులు తెలిపారు. పుణ్యక్షేత్రం ఉన్న లోయ వైపు ఎవరినీ అనుమతించడం లేదని వారు చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో, మార్గమధ్యంలో చిక్కుకు పోయిన యాత్రికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.