: ఉత్తమ నటి పురస్కారాన్ని తిరస్కరించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ


సాధారణంగా ఏ అవార్డు వచ్చినా పొంగిపోని నటీనటులు ఉండరు. కానీ, తన రూటే సపరేటు అని బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగనా రనౌత్ చాటి చెప్పింది. వివరాల్లోకి వెళితే, మెల్ బోర్న్ ఫిలిం ఫెస్టివల్ కు హాజరుకావాలంటూ ఆమెకు ఆహ్వానం అందింది. తాను నటించిన 'తను వెడ్స్ మను రిటర్న్స్' సినిమాకు గాను తనకు ఉత్తమ నటి పురస్కారాన్ని ఇస్తున్నట్టు సమాచారం అందింది. అయితే, ఫిలిం ఫెస్టివల్ కు హాజరవుతాను కానీ... అవార్డు మాత్రం తీసుకోనని కంగన సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. ఇలాంటి అవార్డుల పట్ల తనకు నమ్మకం లేదని... ఇండియాలో కూడా ఇలాంటి అవార్డులు తీసుకోనని ఆమె చెప్పిందట. వారెవ్వా... కంగనా!

  • Loading...

More Telugu News