: ఒక వ్యక్తికి ఒకే ఓటు: సోమేష్ కుమార్


ఒక వ్యక్తికి ఒకే ఓటు హక్కు ఉండాలనే లక్ష్యంతోనే ఓటర్ కార్డుకు ఆధార్ ను అనుసంధానం చేస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ తెలిపారు. తాము చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ ఎత్తున స్పందన లభించిందని ఆయన తెలిపారు. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు ఉండటం రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. దేశ వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణలోని ప్రజలంతా తమ ఓటరు కార్డుకు ఆధార్ ను అనుసంధానం చేసుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News