: దీక్ష కోసం ఢిల్లీ బయల్దేరిన జగన్... ఎల్లుండి తిరుపతికి వచ్చి మునికోటి కుటుంబాన్ని పరామర్శించనున్న వైకాపా అధినేత
'ప్రత్యేక హోదా ఏపీ హక్కు' అంటూ దీక్ష చేపట్టడానికి వైకాపా అధినేత జగన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆయన దీక్ష చేపడతారు. ఈ దీక్షకు వైకాపాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు భారీ సంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు పాల్గొననున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ దీక్ష మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతుంది. ఆ మరుసటి రోజు (మంగళవారం) ఢిల్లీ నుంచి నేరుగా తిరుపతి చేరుకుని... ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యకు పాల్పడ్డ మునికోటి కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారు.