: ప్రత్యేక హోదాను గత ప్రభుత్వం బిల్లులో చేర్చి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు: వెంకయ్యనాయుడు


ప్రత్యేక హోదా కోసం తిరుపతిలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఇకపై ఎవరూ ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడరాదని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని గత ప్రభుత్వం విభజన బిల్లులో చేర్చి ఉంటే ప్రస్తుత సమస్య వచ్చి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేసిన యూపీఏ ప్రభుత్వం... చివరకు బిల్లులో ఆ అంశాన్ని చేర్చకుండా, మోసం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించినందువల్లే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైందని అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి చక్కబడిన తర్వాత హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం నివేదికతో ప్రత్యేక హోదాపై ఈ పరిస్థితి నెలకొందని చెప్పారు. ఏదేమైనప్పటికీ, ఏపీ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రధాన అజెండా అని తెలిపారు. ఇదే విషయంపై మోదీ, అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్ లతో చర్చిస్తున్నానని... ప్రత్యేక హోదా అంశాన్ని దయచేసి రాజకీయం చేయకండని విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News