: మనకున్నది కేంద్ర ప్రభుత్వం కాదు... ట్విట్టర్ ప్రభుత్వం: నితీష్ కుమార్


కేంద్ర ప్రభుత్వం, మోదీ పాలనపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మండిపడ్డారు. 'మనకున్నది కేంద్ర ప్రభుత్వం కాదు... ట్విట్టర్ ప్రభుత్వం' అని ఎద్దేవా చేశారు. విషయాలను తెలుసుకోవడం, స్పందించడంతో పాటు చర్యలు తీసుకోవడం కూడా ట్విట్టర్ లోనే జరుగుతున్నాయని ప్రధాని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రధాని పదవిని మోదీ చేపట్టి ఏడాది దాటుతున్నా... ఇంతవరకు రైతులకు ఒరిగిందేమీ లేదని అన్నారు. వ్యవసాయాన్ని చిన్న చూపు చూస్తున్నారని, రైతులకు కనీస గిట్టుబాటు ధర కూడా కల్పించడం లేదని మండిపడ్డారు. నేర చరిత్ర ఉన్న వాళ్లకు ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోమని చెప్పిన మోదీ... బీహార్ ఎన్నికల్లో ఆమాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News