: ఆఫ్ఘనిస్థాన్ లో కారు బాంబు పేలుడు... 22 మంది దుర్మరణం
ఆఫ్ఘనిస్థాన్ మరోసారి నెత్తురోడింది. నిన్న అర్ధరాత్రి కుందుజ్ ప్రావిన్స్ లో కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 22 మంది దుర్మరణం పాలయ్యారు. ఖాన్ అబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఓ ఉగ్రవాది ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడికి పాల్పడింది తామేనని తాలిబాన్ మిలిటెంట్లు ప్రకటించుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా తన బలగాలను ఉపసంహరించుకున్న తర్వాత... ఆ దేశంలో తాలిబాన్ల దాడులు మళ్లీ పెరుగుతుండటం గమనార్హం.