: చంద్రబాబు, జగన్, రఘువీరా, వెంకయ్య, చిరంజీవి అందరూ మోదీ ఇంటి ముందు కూర్చోండి... ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సీమాంధ్రులు
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా కోసం నిప్పంటించుకున్న మునికోటి మరణంతో సీమాంధ్రుల్లో ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా, ఈ ఘటన జరిగిన తిరుపతి ప్రజలు రగిలిపోతున్నారు. నేతలంతా తమతమ సొల్లు మీటింగులు పెట్టుకుంటూ, ఊకదంపుడు ఉపన్యాసాలతోనే సరిపెడుతున్నారని తిరుపతికి చెందిన ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. జరిగింది జరిగిపోయింది... ఇకనైనా చంద్రబాబు, జగన్, రఘువీరారెడ్డి, వెంకయ్యనాయుడు, చిరంజీవి తదితర ముఖ్య నేతలంతా ఉపన్యాసాలు ఆపి, ప్రధాని మోదీ ఇంటి ముందు కూర్చోవాలని డిమాండ్ చేశాడు. వీరంతా ఏకమైతే ఏపీకి ప్రత్యేక హోదా రావడం పెద్ద కష్టమేమీ కాదని ఆయన అన్నాడు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తేనే మునికోటి ఆత్మకు శాంతి లభిస్తుందని చెప్పాడు.