: 'ప్రత్యేక హోదా' కోసం తపించిన ఆ గుండె ఆగిపోయింది: కన్నుమూసిన మునికోటి


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని తపించిన ఆ గుండె ఆగిపోయింది. నిన్న తిరుపతిలో హోదాను తక్షణం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్న కాంగ్రెస్ కార్యకర్త మునికోటి ఈ మధ్యాహ్నం మృతిచెందాడు. 80 శాతానికి పైగా కాలిన గాయాలతో చెన్నైలోని కేఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మునికోటి శరీరంలోని పలు అవయవాలు మంటల కారణంగా పనిచేయని స్థితిలోకి వెళ్లడమే ఇందుకు కారణమని వైద్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల కారెం శివాజీ సంతాపం ప్రకటించారు.

  • Loading...

More Telugu News