: భార్యలు, ప్రియురాళ్లే ఆస్ట్రేలియా కొంపముంచారట!


ఇంగ్లండ్ తో యాషెస్ సిరీస్ లో అత్యంత ఘోర వైఫల్యానికి ఆసీస్ క్రికెటర్ల భార్యలు, ప్రియురాళ్లే కారణమంటున్నాడు ఆ దేశ క్రికెట్ లెజండ్ ఇయాన్ హీలీ. క్రికెటర్లంతా తమ సతీమణులతో, ప్రేయసులతో వచ్చారని, సరిగ్గా రాణించలేకపోవడానికి కారణం వీరంతా తమ భాగస్వాములతో కలసి టూర్లు జరిపేందుకు చూపిన ఆసక్తి, ఇంగ్లండ్ పిచ్ ల పనితీరు ఎలా ఉందన్న విషయాన్ని తెలుసుకునేందుకు చూపలేదని విమర్శించారు. మంచి ఆటగాళ్లు తమ జీవిత భాగస్వాములతో ఆటలు ఆడేందుకు రారని, తాము ఆడే సమయంలో సిరీస్ గెలిచిన తరువాతనే భాగస్వామితో కలిసి ఉండేందుకు అనుమతి లభించేదని ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు పరిస్థితి మారిందని, ఎంతో శ్రద్ధతో ఆడాల్సిన ఆటను, మనసు పెట్టి ఆడుతున్నట్టు తనకు అనిపించడం లేదని విమర్శించారు.

  • Loading...

More Telugu News