: అనంతపురంలో బెట్టింగ్ రాకెట్ గుట్టురట్టు
ఐపీఎల్ పుణ్యమా అని రాష్ట్రంలో బెట్టింగ్ లు జోరుగా సాగుతున్నాయి! ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా అనంతపురం జిల్లాలో బెట్టింగ్ కు పాల్పడుతోన్న 9 మందిని నేడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంతకల్ పట్టణంలో జరిగిన ఈ దాడుల్లో బెట్టింగ్ రాయుళ్ళ నుంచి పోలీసులు రూ. 1.20 లక్షల నగదు, 6 సెల్ ఫోన్లు, టీవీ స్వాధీనం చేసుకున్నారు.