: చోళ రాజుల కాలంనాటి విలువైన నంది అపహరణ
చోళుల కాలం నాటి విలువైన నంది విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు దొంగిలించారు. ఈ ఘటన గుంటూరు జిల్లా రొంపిచర్లలోని శ్రీ బాలాత్రిపురసుందరి సమేత శంకరుని దేవాలయంలో జరిగింది. గత అర్ధరాత్రి సమయంలో ఆలయంలోకి చొరబడిన దుండగులు ఈ పురాతన నల్లరాయి విగ్రహాన్ని అపహరించారు. ఆలయంలో దొంగతనం జరిగిందన్న విషయాన్ని ఆదివారం ఉదయం గుర్తించిన ఆలయ అర్చకుడు శ్రీనివాసశర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.