: రాజ్యమా? గో మాంసమా?... రెండింటిలో ఒకటే సాధ్యమని వీలునామాలో ప్రస్తావించిన మొఘల్ చక్రవర్తి బాబర్


మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి బాబర్, ఇండియాలో గోవుల మాంసాన్ని తింటే, ప్రజల్లో అపఖ్యాతి పొందుతామని భావించారట. రాజ్యాన్ని పాలించాలంటే, గోవధకు బహిరంగ మద్దతు ఇవ్వరాదని తన వీలునామాలో రాసుకున్నాడు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. "మొఘల్ చక్రవర్తుల గురించి తనకు తెలిసిన కొద్ది సమాచారం ప్రకారం, వారికీ నిజం తెలుసు. గోవధకు బహిరంగ మద్దతు ప్రకటిస్తే, ఎక్కువ రోజులు రాజులుగా ఉండలేమని వారు నమ్మారు" అని తెలిపారు. ఓకేసారి ఈ రెండు పనులనూ చేయలేమని, ప్రజల హృదయాలను గెలుచుకోవాలంటే, గోమాంస భక్షణ ఆపాలని బాబర్ తన వీలునామాలో రాసినట్టు తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించడంలో బ్రిటీష్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. తుపాకీ తూటాల్లో ఆవు కొవ్వును వాడటం మూలంగానే 1857 సిపాయిల తిరుగుబాటు మొదలైందని ఆయన గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News