: పని ఒత్తిడిలో గబగబా తినేస్తారా?... నష్టాలివే!


ఉద్యోగాలకు వెళ్లాలన్న తొందరలో ఉదయం అల్పాహారాన్ని, మధ్యాహ్నం ఆఫీసు పని ఒత్తిడిలో భోజనాన్ని, ఏదో అయిందంటే, అయిందనిపించేలా ముగించేస్తున్నారా? ఈ తీరు మంచిది కాదంటున్నారు ఆహార నిపుణులు. ఎన్ని పనులున్నా సరైన ఆహారాన్ని, నెమ్మదిగా తినడమే మంచిదని, గబగబా తినడం వల్ల నష్టాలే అధికమని చెబుతున్నారు. * అల్పాహారం తీసుకోవడం కుదరకుంటే, రకరకాల పండ్లు, శాండ్ విచ్ వంటివి తీసుకోవచ్చు. కడుపును ఏ మాత్రం ఖాళీగా ఉంచకుండా బాదం పప్పులు వంటివి తింటే తక్షణ శక్తి అందుతుంది. * నాలుగు ముద్దలు గబగబా లాగించేసి మధ్యాహ్న భోజనం అయిందనిపిస్తే నష్టమే. వేగంగా తినడం వల్ల జీర్ణక్రియలు దెబ్బతింటాయి. సరిగ్గా నమలకపోవడం వల్ల ఆహారం త్వరగా అరగదు. దీంతో పోషకాలు కూడా సమయానికి అందవు. * వేగంగా తినేస్తే, ఆపై శరీరంపై ఒత్తిడి పడుతుంది. భోజనానికి కనీసం 20 నిమిషాలు కేటాయిస్తే మంచిది. ఇదే సమయంలో అటు ఎక్కువ, ఇటు తక్కువ కాకుండా ఆహారం తీసుకోవాలి. * ఏది అందుబాటులో ఉంటే దాన్ని తింటే, షుగర్, స్థూలకాయం సమస్యలు పెరుగుతాయి. * సమయానికి భోజనం పూర్తిచేయాలి. అలా చేయకుంటే, రక్తంలో చక్కెర శాతం పెరిగి ఇబ్బందులు ఎదురవుతాయి.

  • Loading...

More Telugu News