: 'ఫ్రీడం' అంటున్న ఫ్లిప్ కార్ట్, 'ఆజాద్' అంటున్న ఈబే... ఏ ప్రొడక్టుపై ఏ ఆఫరుందంటే..!


పంద్రాగస్టు వేడుకలను మరింతగా గుర్తుండిపోయేలా చేసేందుకు ఈ-కామర్స్ వెబ్ సైట్లు సరికొత్త ఆఫర్లతో ముందుకొచ్చాయి. 'ది ఫ్రీడం డే' అంటూ ఫ్లిప్ కార్ట్, 'ఆజాదీ సేల్స్' అంటూ ఈబే ప్రత్యేకంగా విక్రయాలు చేపట్టాయి. ఇందులో భాగంగా స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ 4కే ఎల్ఈడీ టీవీలు తదితర లక్షలాది ప్రొడక్టులను సరసమైన ధరలకు అందిస్తామని చెబుతున్నాయి. మొబైల్ ఫోన్లను అతి తక్కువ ధరకు ఇస్తామని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఇక మొబైల్ యాప్ ద్వారా ఆర్డర్లిస్తే మరింత తక్కువ ధరకు ప్రొడక్టులు ఇస్తామని, ఒక్కో ప్రొడక్టుపై గరిష్ఠంగా రూ. 2 వేల వరకూ డిస్కౌంట్ పొందవచ్చని తెలిపింది. రూ. 56 వేల రూపాయల ధర ఉండే యాపిల్ ఐఫోన్ 6 (16 జీబీ)ని రూ. 42,949కి ఇస్తామని, ఇదే సమయంలో మీ పాత స్మార్ట్ ఫోన్ ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే ఈ ఫోన్ ను రూ. 29,499కే ఇస్తామని వెల్లడించింది. ఇక ఫ్లిప్ కార్ట్ రూ. 34,999 రూపాయల ధర ఉన్న నెక్సస్ 6 (32 జీబీ) వేరియంట్ ను రూ. 29,999 రూపాయలకు ఇస్తామని, ఎక్స్ఛేంజ్ ఆఫర్లో భాగంగా ఇదే ఫోన్ ను రూ. 19,999కి ఇస్తామని పేర్కొంది. రూ. 53 వేల ఎంఆర్పీ ధర ఉండే హెచ్ టీసీ వన్ ఎం9 ప్లస్ ను రూ. 35,611కు అందిస్తామని ఈబే వెల్లడిస్తే, రూ. 21,998 ధర ఉన్న వన్ ప్లస్ వన్ (64 జీబీ)ని రూ. 20,998కి ఇస్తామని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. రూ. 69,990 ధర ఉన్న మైక్రోమ్యాక్స్ 42 అంగుళాల 4కే ఎల్ఈడీ టీవీని రూ. 35,990 రూపాయలకు ఇస్తామని, ఎస్బీఐ కార్డు వాడితే రూ. 2 వేల డిస్కౌంట్, పాత టీవీని మార్పు చేసుకోదలిస్తే మరో రూ. 2,500 డిస్కౌంట్ ఇస్తున్నట్టు ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఇలా ఎన్నో రకాల ప్రొడక్టులను తక్కువ ధరలకు అందిస్తామని ఈ-కామర్స్ వెబ్ సైట్లు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News