: మునికోటి పరిస్థితి విషమం... వేలూరు తరలింపు
రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో తాజా పరిణామాల నేపథ్యంలో తీవ్ర మనస్తాపం చెందిన కాంగ్రెస్ కార్యకర్త మునికోటి తిరుపతిలో శనివారం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతికి యత్నించడం తెలిసిందే. కాంగ్రెస్ పోరు సభ ఆరంభమైన కొద్దిసేపటికే ఆత్మాహుతికి యత్నించిన మునికోటి మంటలు చుట్టుముట్టినా నినాదాలు చేయడం ఆపలేదు. తీవ్రగాయాలపాలైన అతడిని వెంటనే రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే, పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం అతడిని వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు.