: రఘువీరా అసమర్థత వల్లే తిరుపతి ఘటన జరిగింది: సోమిరెడ్డి
తిరుపతిలో ఈరోజు ఓ కాంగ్రెస్ కార్యకర్త ఒంటికి నిప్పంటించుకుని ఆత్మాహుతికి యత్నించడంపై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అసమర్థత వల్లే ఈ ఘటన జరిగిందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఘటనకు రఘువీరాదే భాధ్యత అని స్పష్టం చేశారు. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ పరిస్థితికి కాంగ్రెస్ పార్టీనే కారణమని మండిపడ్డారు. అటు, గాలి ముద్దుకృష్ణమనాయుడు కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. తిరుపతి ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎంతో ఆవేదనతో ఉన్నారని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.