: అవసరమైతే ఆత్మాహుతి దాడి చేస్తా... ఎవరూ ఆత్మాహుతికి పాల్పడవద్దు: శివాజీ
తిరుపతిలో జరిగిన కాంగ్రెస్ పోరు సభలో ఓ యువకుడు ఒంటికి నిప్పంటించుకోవడంపై సినీ నటుడు, ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు శివాజీ తీవ్రంగా స్పందించారు. ప్రత్యేక హోదా కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. 'మీ వెనుక కుటుంబం ఉంది, మీ ముందు ఎంతో జీవితం ఉంది... విలువైన ప్రాణాలను త్యాగం చేయవద్దు' అని అన్నారు. తానెంతో జీవితం చూశానని, అవసరమనుకుంటే ఓ రాజకీయ ప్రముఖుడిపై తాను ఆత్మాహుతి దాడి చేస్తానని స్పష్టం చేశారు. ఆత్మాహుతికైనా సిద్ధమేనని అన్నారు. పుష్కరాలపై పెట్టిన శ్రద్ధ ప్రత్యేక హోదాపై పెట్టాలని చంద్రబాబు సర్కారుకు హితవు పలికారు. ప్రత్యేక హోదా చారిత్రక అవసరమని నొక్కి చెప్పారు. తమకు ప్యాకేజీలు అవసరం లేదని తేల్చి చెప్పారు.