: నిప్పంటించుకుని, ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పరుగులు పెట్టిన కోటి... బరువెక్కిన సీమాంధ్రుల హృదయాలు


ప్రత్యేక హోదా రాకపోతే నవ్యాంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంధకారమవుతుందన్న ఆందోళన. నేతల మాటలు వింటుంటే... ఇక ప్రత్యేక హోదా రాదనే భయం. ప్రత్యేక హోదా రాకపోతే రానున్న తరాల భవిష్యత్తు ఏంటనే ఆలోచన. ఎవరి స్వార్థానికి వాళ్లు మాట్లాడుతూ, నటిస్తున్న నాయకులు. ఏదో ఒకటి చేసి అందర్లో కదలిక తీసుకురావాలనుకున్నాడో ఏమో... తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సభలో తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ మూత తీసి, ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు కోటి. దావాగ్ని శరీరమంతా కబళిస్తున్నా, ఒంటిమీద చర్మం కాలి జారిపోతున్నా ఆ మంటలను లెక్కచేయలేదు. 'నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి' అని అరుస్తూ పరుగులు పెట్టాడు. అప్పటికే 50 శాతంపైగా కాలిపోయిన కోటిని రక్షించడానికి అక్కడున్న వారు విశ్వప్రయత్నం చేశారు. చివరకు మంటలను ఆర్పేశారు. కోటిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. కోటికి అంటుకున్న మంటలను ఆర్పే యత్నం చేసిన మరో వ్యక్తి చేతులు కూడా కాలిపోవడం గమనార్హం. ఆత్మబలిదానాలు చేయడం తెలంగాణ ఉద్యమంలో చూశాం. అదే ఆత్మబలిదాన ప్రయత్నం తొలిసారి సీమాంధ్రలో కూడా జరగడంతో ఆంధ్ర రాష్ట్రం ఉలిక్కిపడింది. టీవీలో అగ్నికీలల్లో చిక్కుకున్న కోటిని చూసి సీమాంధ్రుల హృదయాలు బరువెక్కాయి.

  • Loading...

More Telugu News