: విడుదలైన రోజే కొత్త రికార్డు నెలకొల్పిన 'శ్రీమంతుడు'
కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన 'శ్రీమంతుడు' చిత్రం విడుదలైన తొలిరోజే ఆంధ్రా, సీడెడ్, నైజాం ప్రాంతాల్లో కొత్త రికార్డు నెలకొల్పింది. ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ సినిమా రూ.13.50 కోట్లు మొదటిరోజు వసూలు చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రా ప్రాంతం నుంచి రూ.7.5 కోట్లు, సీడెడ్ ఏరియా నుంచి రూ.2.05 కోట్లు, నైజాం ప్రాంతం నుంచి దాదాపు రూ.4 కోట్లు వసూలు చేసింది. ఇంతకుముందు విడుదలైన మొదటిరోజే ఏపీ, నైజాం ప్రాంతాల్లో రూ.22 కోట్లు వసూలు చేసిన 'బాహుబలి' రికార్డు తొలిస్థానంలో ఉంది. దీంతో శ్రీమంతుడు ద్వితీయ స్థానం కొట్టింది. మొత్తంమీద మహేష్ సినీ కెరీర్ లోనే అత్యధికంగా వసూలు చేసిన చిత్రంతో పాటు... టాలీవుడ్ లో విడుదలైన రోజే బిగ్గెస్ట్ ఓపెనర్లలో ఒకటిగా నిలిచిందని అంటున్నారు.