: ఉగ్రవాది నవేద్ కు ఆశ్రయమిచ్చిన వ్యక్తి అరెస్ట్
పాక్ ఉగ్రవాది నవేద్ కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు మరో అడుగు ముందుకు వేశారు. దక్షిణ కాశ్మీర్ లో నవేద్ కు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తిని ఎన్ఐఏ ఈ రోజు అరెస్ట్ చేసింది. ఎన్ఐఏ అధికారులతో పాటు, జమ్ము కాశ్మీర్ పోలీసులు సదరు వ్యక్తిని విచారిస్తున్నారు. రెండు నెలల పాటు కాశ్మీర్ లో తలదాచుకున్నానని నవేద్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, ఈ రెండు నెలల కాలంలో ఎవరెవరితో నవేద్ సంబంధాలు కలిగి ఉన్నాడనే కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది.