: టాటా ఇండిక్యాష్ ఏటీఎంలో వందకు బదులు రూ.500 వస్తోంది!


ఓ ఏటీఎంలో రూ.100లు డ్రా చేస్తుంటే రూ.500 వస్తున్న ఘటన ఆశ్చర్యపరుస్తోంది. దాంతో ఈ ఏటీఎం పరిసరాల్లోని స్థానికులు డబ్బు డ్రా చేసుకునేందుకు ఎగబడుతున్నారు. మెదక్ జిల్లా నరసాపూర్ లోని బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన 'టాటా ఇండిక్యాష్' ఏటీఎంలో ఇలా జరుగుతోంది. ఎప్పటిలానే డబ్బులు తీసుకునేందుకు వెళ్లిన వారు వంద రూపాయలు డ్రా చేయడానికి ప్రయత్నిస్తుంటే ఐదు వందలు వస్తున్నాయని గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఏటీఎం వద్దకు వచ్చి లోపలికి ఎవరినీ వెళ్లనీయకుండా భద్రతా ఏర్పాట్లు చేసి, సంబంధిత బ్యాంకు అధికారులకు తెలియజేశారు.

  • Loading...

More Telugu News