: తెనాలి వైద్యుల నిర్వాకం... సిజేరియన్ కోసం వెళ్తే, మూత్ర విసర్జన పేగును కట్ చేశారు
తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్వాకంతో ఒక నిండు చూలాలు మృత్యువాత పడింది. వివరాల్లోకి వెళితే, సిజేరియన్ ఆపరేషన్ చేయించుకునేందుకు ఒక మహిళ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. ఆపరేషన్ ప్రారంభమైంది. అయితే, పొరపాటున ఆ మహిళ మూత్ర విసర్జన పేగును కట్ చేశారు డాక్టర్లు. దీంతో, ఆమె నోరు, ముక్కు నుంచి మూత్రం బయటకు వచ్చింది. వెంటనే ఆమెను జీజీహెచ్ ఆసుప్రతికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మహిళ మృతికి వైద్యులే కారణమంటూ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆమె బంధువులు ఆందోళనకు దిగారు.