: ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం జగన్ మానుకోవాలి: మంత్రి యనమల
తొలగించిన వైఎస్ చిత్రపటాన్ని అసెంబ్లీ లాంజ్ లో ఏర్పాటు చేయాలంటూ ఈ రోజు ఏపీ సీఎం, స్పీకర్ కు రాసిన లేఖలో వైఎస్ జగన్ కోరడంపై ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. శాసనసభలో ముఖ్యమంత్రుల చిత్రపటాలు పెట్టడం సంప్రదాయం కాదని, దానికి విరుద్ధంగా సభా ఆవరణలో మాజీ సీఎం వైఎస్ చిత్రపటం ఉంచారని పేర్కొన్నారు. స్పీకర్ ఫోటో ఉంచాల్సిన చోట మాజీ సీఎం చిత్రపటం ఉంచడం ఏరకమైన సంప్రదాయం? అని అడిగారు. ప్రస్తుతం ఈ వ్యవహారమంతా సభాపతి పరిధిలో ఉందని, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని యనమల తేల్చి చెప్పారు. అయితే ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం జగన్ మానుకోవాలని సూచించారు.