: ‘పోలీస్’ అభ్యర్థులకు ‘పరుగు’ భయం లేదు... 5కే రన్ రద్దుకు టీ సర్కారు యోచన
తెలంగాణలో పెద్ద సంఖ్యలో పోలీస్ కానిస్టేబుళ్ల నియామకానికి త్వరలో తెర లేవనుంది. నిన్నటిదాకా కానిస్టేబుల్ పోస్టును దక్కించుకోవాలంటే కిలో మీటర్ల మేర చెమటలు కక్కుతూ పరుగు పెట్టాల్సిందే. ఈ క్రమంలో కొంత మంది అభ్యర్థులు స్పృహ తప్పిన ఘటనలూ నమోదయ్యాయి. అయితే తాజాగా మొదలుకానున్న కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియలో 5కే రన్ ను తొలగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ 5కే రన్ ను తొలగించాలని ప్రతిపాదించింది. దీనిపై త్వరలో జరిగే కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.