: మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: జానారెడ్డి
మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని సీఎల్పీ నేత జానారెడ్డి ఆరోపించారు. అదే ఉంటే కనుక, సమస్యను ఎప్పుడో పరిష్కరించేవారని చెప్పారు. వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని, కార్మికుల సమ్మె విరమణకు ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. గాంధీభవన్ లో సమావేశం అనంతరం జానా మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలుంటే బయటపెట్టాలని, అక్రమాలకు ఎవరు పాల్పడినా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనర్హులకు మంత్రి హరీశ్ రావు సిఫార్సు చేసి ఉంటే చర్యలు తీసుకోవాలన్నారు. ఇక బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం చేస్తున్న జాప్యానికి మూల్యం చెల్లించుకుంటుందని జానా హెచ్చరించారు. రాష్ట్రంలో కరవు తీవ్రంగా ఉందని, అసెంబ్లీ సమావేశపరచి చర్చించాలని కోరారు. తాను పార్టీ అధిష్ఠానానికి దూరంగా ఉన్నాననుకుంటే అవగాహనా లోపమేనని స్పష్టం చేశారు.